రూల్స్ ప్రకారమే చిన్నారులను దత్తత ఇస్తం: సీతక్క

హైదరాబాద్, వెలుగు: జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం.. చిన్నారుల దత్తత విషయంలో అన్ని మార్గద‌‌‌‌‌‌‌‌ర్శకాల‌‌‌‌‌‌‌‌ను  పాటిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఇటీవల పోలీసులు కాపాడిన 15 మంది చిన్నారులు శిశు విహార్ లో క్షేమంగా ఉన్నారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులు, కేంద్ర ద‌‌‌‌‌‌‌‌త్తత గైడ్ లైన్స్ ప్రకారం నిబంధ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను పాటిస్తూ ఈ చిన్నారుల ద‌‌‌‌‌‌‌‌త్తత ప్రక్రియ కొన‌‌‌‌‌‌‌‌సాగనుందని మంత్రి స్పష్టం చేశారు. “మేడిపల్లి పోలీసులు ఈ ఏడాది మే 22న అంతర్ రాష్ట్ర పిల్లల అక్రమ రవాణా రాకెట్‌‌‌‌‌‌‌‌ను ఛేదించి,11 మందిని అరెస్ట్​ చేశారు. 

వీరి నుంచి 15 మంది చిన్నారుల‌‌‌‌‌‌‌‌ను కాపాడారు. అనంతరం వారిని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని శిశువిహార్‌‌‌‌‌‌‌‌లో (స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ) మ‌‌‌‌‌‌‌‌హిళా శిశు సంక్షేమ శాఖ సంర‌‌‌‌‌‌‌‌క్షణ‌‌‌‌‌‌‌‌లో ఉంచారు. అయితే, పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులమని పేర్కొంటూ కొంద‌‌‌‌‌‌‌‌రు హైకోర్టులో 9 పిటిషన్లు దాఖలు చేశారు. మొదట, సింగిల్ జడ్జి బెంచ్ పిల్లలను పిటిషనర్లకు (దత్తత తీసుకున్న తల్లిదండ్రులుగా చెప్పుకునే) అప్పగించాలని ఆదేశించింది. దీన్ని స‌‌‌‌‌‌‌‌వాల్ చేస్తూ మ‌‌‌‌‌‌‌‌హిళా శిశు సంక్షేమ శాఖ   రిట్ దాఖ‌‌‌‌‌‌‌‌లు చేసింది. దాంతో15 మంది చిన్నారుల‌‌‌‌‌‌‌‌ పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ జిల్లా అధికారుల‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది”  అని సీతక్క పేర్కొన్నారు.