అల్లు అర్జున్ అరెస్ట్ చట్ట ప్రకారమే జరిగింది: మంత్రి సీతక్క

ఐకాన్ స్టార్ అల్లు అర్జున అరెస్ట్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం ( డిసెంబర్ 13, 2024 ) అరెస్టైన అల్లు అర్జున్.. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో ఒకరోజు జైల్లో గడిపి శనివారం ఉదయం ( డిసెంబర్ 14, 2024 ) విడుదలయ్యారు. చంచల్ గూడా జైలు నుంచి ఇంటికి వచ్చిన బన్నీని పరామర్శించేందుకు సెలబ్రిటీలంతా క్యూ కట్టారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. అల్లు అర్జున్ అరెస్టు చట్ట ప్రకారమే జరిగిదని అన్నారు.

Also Read : బాలకృష్ణ కూతురి పాత్రలో స్టార్ హీరోయిన్ డాటర్..

అల్లు అర్జున్ పై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని.. చట్టం ఎవరికీ చుట్టం కాదని అన్నారు సీతక్క. అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ప్రభుత్వ హస్తం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న క్రమంలో మంత్రి సీతక్క కామెంట్స్ కీలకంగా మారాయి. ఇదిలా ఉండగా.. జైలు నుంచి విడుదలైన బన్నీని పరామర్శించేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కట్టారు. అల్లము అర్జున్ ని కలిసి పరామర్శించిన వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు, డైరెక్టర్ హరీష్ శంకర్, హీరో రానా, ఆర్‌, నారాయణ మూర్తి, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ కొరటాల శివ తదితరులు ఉన్నారు.