మన్మో హన్ సింగ్ ఆర్బీఐలో అనేక మార్పులు తీసుకొచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీలో మన్మోహన్ మృతిపై సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడిన ఆయన... కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ ఆధ్వర్యంలో మన్మోహన్ ఆర్థిక మంత్రి అయ్యారని చెప్పారు. మన్మోహన్ తో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు పొన్నం. మోడల్ స్కూల్ వ్యవస్థను మన్మోహన్ తీసుకొచ్చరని చెప్పారు పొన్నం.
ALSO READ : చరిత్రలో నిలిచిపోయే చట్టాలు తెచ్చిన గ్రేట్ లీడర్ మన్మోహన్ సింగ్: మంత్రి ఉత్తమ్
గ్లోబలైజేషన్ తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు పొన్నం. ఆర్టీఐ చట్టంతో పారదర్శకతకు పెద్దపీట దక్కిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మన్మోహన్ సింగ్ 90 ఏళ్ల వయసులో వీల్ ఛైర్ లో వచ్చి రాజ్యసభలో ఓటు వేశారని గుర్తు చేశారు పొన్నం. దేశంలో 72 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశారని తెలిపారు. మన్మోహన్ సింగ్ హైదరాబాద్ కు ఓఆర్ఆర్, మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇచ్చారని గుర్తు చేశారు పొన్నం. మన్మోహన్ మృతిపై ప్రపంచ దేశాలు స్పందించాయని.. మన్మోహన్ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందన్నారు.