కొత్త రూట్లలో బస్సులు పెంచుతాం : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు : కొత్త రూట్లల్లో బస్సులను పెంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. గురువారం హుస్నాబాద్​లో మంత్రి మార్నింగ్​వాక్​ చేస్తూ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులతో మాట్లడి అక్కడే పరిష్కరించారు. బస్టాండ్​లో ప్రయాణికులతో మాట్లడి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

పత్తి తీసేందుకు వెళ్తున్న మహిళా కూలీలతో మాట్లాడుతూ.. రోజు కూలీ ఎంత ఇస్తారని, ఈ సారి పత్తి దిగుబడి ఎలా ఉందని ఆరా తీశారు. అనంతరం పట్టణంలోని సిద్ధేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి ఆరు కిలోల వెండి రుద్రకవచం సమర్పించి అభిషేకం, హోమం నిర్వహించారు.

ఎన్నికల సమయంలో తాను కోరుకున్న కోరిక నెరవేరడంతో మొక్కు చెల్లించుకున్నానని చెప్పారు. ఆయన వెంట జిల్లా లైబ్రరీ చైర్మన్​లింగమూర్తి, ఇతర కాంగ్రెస్​నాయకులు ఉన్నారు.