హుస్నాబాద్ లో నీట మునిగిన కాలనీలు.. పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదల బీభత్సం సృష్టించాయి. ఖమ్మం, వరంగల్, నల్ల గొండ, హైదరాబాద్ తో పాటు సిద్దిపేట జిల్లాల్లో కూడా వరదలు అతలాకుతలం చేశాయి.  సిద్దిపేటలో పలు ప్రాంతాల్లో మంత్రి పొన్న ప్రభాకర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.   

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్నాబాద్ లో కాలనీలు నీట మునిగాయి. దీంతో దుకాణాలు ఇండ్లలోకి వరద నీరు చేరింది. హుస్నాబాద్ లోని వరద ప్రభావిత కాలనీల్లో మంత్రి పొన్నం పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. కాలనీలు వరద ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కార మార్గాలు చూస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. 

ALSO READ | లోయర్ మానేరు డ్యాంను సందర్శించిన మంత్రి పొన్నం