ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపార ధోరణి మారాలి: మంత్రి పొన్నం

ప్రైవేటు విద్యా సంస్థలు వ్యాపార దృష్టితో కాకుండా, భావి భారత పౌరులను తీర్చి దిద్దాలనే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణ రికాగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (TRSMA) జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి.. విద్యా్ర్థులను తీర్చిదిద్దడంలో ప్రైవేటు విద్యా సంస్థల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు సమాంతరంగా పనిచేసినపుడే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. 

రాష్ట్రంలో దాదాపు 60 శాతం విద్యా్ర్థులు ప్రైవేటు సంస్థలల్లోనే చదువుతున్నారని, వ్యాపర దృష్టితో కాకుండా విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించేందుకు అందించేందుకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ఎంఏ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. మధుసూధన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ | నో పర్మిషన్.. కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోవద్దు : హైకోర్టు