విద్యకు ఫస్ట్​ ప్రియారిటీ : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ,వెలుగు: ఇంటిగ్రేటెడ్​రెసిడెన్షియల్​స్కూల్​నిర్మాణాన్ని వచ్చే అకాడమిక్​ ఇయర్​వరకు పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. శుక్రవారం మండలంలోని తంగళ్లపల్లిలో యంగ్​ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్​స్కూల్​నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు అధిక ప్రాధన్యం ఇస్తున్నామన్నారు. రాష్ర్టంలో రూ.1100 కోట్లతో స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామన్నారు. గురుకులాల్లో పెండింగ్​లో ఉన్న మెస్​చార్జీలు, అద్దె బకాయిలు చెల్లించామని, 19 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, 35 వేల మంది టీచర్లకు బదిలీలు చేపట్టామని తెలిపారు. 

డీఎస్సీ ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్​దే అన్నారు.  సముద్రాలలో ఇన్నోవేషన్​ పార్కు, బస్వాపూర్​లో కృషి విజ్ఞాన కేంద్రాలకు త్వరలో భూమి పూజ చేస్తామన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​శ్రీనివాస్​రెడ్డి, ఆర్డీవో రాంమూర్తి, గ్రంథాలయ చైర్మన్​లింగమూర్తి, మండల అధ్యక్షుడు ధర్మయ్య, సుధాకర్, శంకర్, జయరాజ్, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డి, మల్లారెడ్డి, శ్రీకాంత్, రవి, శ్రీధర్, నారాయణ పాల్గొన్నారు.