ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థినికి..మంత్రి పొన్నం ప్రభాకర్ సాయం

సిద్దిపేట: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థినిని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఆదుకున్నారు. చదువు కొనసాగించేందుకు చేయూతనిచ్చారు. మెడికల్ సీటు సాధించి హాస్టల్ ఫీజుల కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థినికి ఆర్ధికసాయం చేశారు. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్ల నాయక్ తండాకి చెందిన లావుడ్యా రమేష్ లక్ష్మీ ల కుమార్తే లావుడ్య దేవీ మిట్టపల్లి సురభిమెడికల్ కాలేజీలో మెడికల్ సీటు సాధించింది. 

అయితే రమేష్ ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో దేవీ హాస్టల్ ఖర్చుల కోసం మంత్రి పొన్న ప్రభాకర్ లక్షాయాభై వేల రూపాయలు సాయం చేశారు. ఈమేరకు మంత్రి క్యాంప్ ఆఫీసులో చెక్కును దేవీకి అందజేశారు. 

Also Read : విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంపు