వరద బాధితులను ఓదార్చిన మంత్రి

హుస్నాబాద్, వెలుగు: భారీ వర్షంతో హుస్నాబాద్​లో ఇండ్లు, దుకాణాలు మునిగిపోవడంతో ఆదివారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్​ వరద బాధితులను ఓదార్చారు. భవిష్యత్ లో వరదలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే అధికారులతో సమీక్ష జరిపి ఇండ్లు, దుకాణాల్లోకి నీరు రాకుండా ప్లాన్​ రూపొందిస్తామన్నారు.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండ్లు మునిగిపోయినవారిని పునరావాసకేంద్రానికి తరలించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలో ఇలాంటి నష్టాన్ని జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.