ట్రాన్స్​ఫర్ల కోసం నా వద్దకు రావొద్దు : పొన్నం ప్రభాకర్​

  • మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ,(హుస్నాబాద్) వెలుగు: ఆర్టీసీ కార్మికులు,టీచర్లు ట్రాన్స్​ఫర్ల కోసం తన వద్దకు వచ్చి ఒత్తిడి తేవొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్​విజ్ఞప్తి చేశారు. గురువారం హుస్నాబాద్​లో పలు అభివృద్ధి పనులకు కలెక్టర్​మను చౌదరితో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. హుస్నాబాద్​లో వరదల నివారణకు డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్​కారిడార్​ ఏర్పాటు చేయడానికి అక్కన్నపేట మండలం చౌటపల్లి వద్ద స్థల పరిశీలన చేసినట్లు తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని గ్రామాల్లో ప్రజల సమక్షంలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. మున్సిపల్​చైర్​పర్సన్​రజిత, గ్రంథాలయ చైర్మన్​లింగమూర్తి, సింగిల్​విండో చైర్మన్​శివ్వయ్య, కమిషనర్​మల్లికార్జున్​పాల్గొన్నారు.