కాలుష్యం కట్టడికి ఈవీ పాలసీ.. దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు: మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌

  • ఈ ఏడాది మొదటి వారంలో అందుబాటులోకి వాహన్ సారథి
  • 42వ రవాణా అభివృద్ధి మండలి సమావేశంలో వెల్లడి 

న్యూఢిల్లీ, వెలుగు: వెహికల్ పొల్యూషన్ కంట్రోల్ కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో స్ర్కాపింగ్‌‌‌‌‌‌‌‌ పాలసీ, ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ పాలసీలు తీసుకొచ్చినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాహనాల నుంచి వెలువడే వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వాహనాలను ప్రోత్సహించేందుకు 100 శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. నేషనల్ రోడ్ సేఫ్టీ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో 42వ రవాణా అభివృద్ధి మండలి సమావేశం జరిగింది.

ఈ సదస్సులో అన్ని  రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త మోటార్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ చట్టం సవరణలు, రహదారి భద్రతా సమస్యలు, వాహన్‌‌‌‌‌‌‌‌ సారథి, ఫేస్‌‌‌‌‌‌‌‌ లేస్‌‌‌‌‌‌‌‌ లావాదేవీలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చ జరిగింది. రాష్ట్రం నుంచి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌.. తెలంగాణ రవాణా శాఖ అమలు చేస్తున్న పాలసీలు, తీసుకుంటున్న చర్యలను సమావేశంలో వివరించారు.

ఈ ఏడాది మే మొదటి వారంలో రాష్ట్రంలో వాహన్‌‌‌‌‌‌‌‌ సారథిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలకు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ సమన్వయంతో ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ పాఠశాలల్లో చిల్ర్డన్‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆర్టిఫీషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌, మెషిన్‌‌‌‌‌‌‌‌ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌ టూల్స్‌‌‌‌‌‌‌‌ ఉపయోగించి ప్రయాణీకుల భద్రతను నిర్థారించడానికి వెహికల్‌‌‌‌‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ అమలు చేస్తున్నట్టు తెలిపారు.

మేడ్చల్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో ఇటీవల 40 ఎకరాల ప్రభుత్వ భూమిని రవాణా శాఖ సేకరించిందని, డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. అనంతరం ఢిల్లీలో ఆటోమాటిక్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌‌‌‌‌ కేంద్రాలను రవాణా శాఖ మంత్రుల టీం విజిట్ చేసింది.