- ‘నా ఆడబిడ్డలు మీరూ..’ అంటూ గాజులకు డబ్బులిచ్చిన శ్రీనన్న
కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలం ఎర్రగడ్డతండాలోని ఓ రిసెప్షన్కు హాజరై వస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుబ్బతండా వద్ద వరి నాట్లు వేస్తున్న కూలీలను చూసి కారు ఆపారు. కిందకు దిగి వారిని ఆప్యాయంగా పలుకరించారు. ‘అంతా బాగున్నారా? పనులు దొరుకుతున్నాయా? కూలి ఎంత ఇస్తున్నారు’ అని అడిగి తెలుసుకున్నారు. ‘ మీరంతా నా ఆడబిడ్డలు’ అంటూ వారికి గాజులు వేసుకోవాలని డబ్బులు ఇచ్చి ముందుకు కదిలారు.