తిరుపతి : తనపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ విధించిన ఆంక్షలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్మగడ్డ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టాలన్నదే నిమ్మగడ్డ తాపత్రయమని, చంద్రబాబుకు బంట్రోతు నిమ్మగడ్డ అంటూ దుయ్యబట్టారు. నిమ్మగడ్డ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకావాల్సిందేనని, ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. నిమ్మగడ్డ ఆదేశాలను ఖాతరు చేయాల్సిన పనిలేదని తోచిపుచ్చారు. ఆయనకు ప్రాయశ్చిత్తం తప్పదని మంత్రి అన్నారు. చంద్రబాబులాగే నిమ్మగడ్డకు పిచ్చి ముదిరిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
