గుడ్ న్యూస్: మహిళలకు ఉచిత బస్సుపై పయ్యావుల కీలక వ్యాఖ్యలు

2024 - 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం . ఇవాళ ( నవంబర్ 11, 2024 ) అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సభ ముందుంచారు పయ్యావుల. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు పయ్యావుల. ఈ పధకం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించే అవకాశం ఉందని బడ్జెట్ ప్రసంగంలో సంకేతాలు ఇచ్చారు పయ్యావుల. 

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చిన నెల నుంచే చెప్పినట్లుగా అంతకు ముందు రెండు నెలలో కలిపి నెలకు రూ.4 వేల నుంచి రూ 15 వేల వరకు పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు..

సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ ఆర్దిక సంవత్సరంలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. అయితే.. మహిళలకు ప్రతి నెల రూ. 1500 వంటి ఇతర పథకాలు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.