రాబోయే రోజుల్లో రైతులు వ్యవసాయం కోరుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలు ఉన్నాయన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఒక్క విద్యుత్ మోటరుపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 వేలు ఖర్చు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం అందని కుటుంబం లేదన్నారు. గతంలో ఎంతో దుర్భర జీవితం గడిపిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు కాలువల ద్వారా 12 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారన్నారు. కాళేశ్వరం కాలువల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రాష్ట్రంగా తీర్చి దిద్దామన్నారు. దేశంలో 60 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉన్నారన్నారు. వాటర్ షెడ్డు నిర్మించుకునే వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో నిజాం కాలం నుండే మొదలయిందన్నారు. రాష్ట్రంలో రసాయానిక ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువులు వాడకాన్ని పెంచాలన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి 50 శాతం ఆదాయం తగ్గినా.. కేసీఆర్ రైతు బంధు సహాయం అందిస్తున్నారన్నారు.
