సెప్టెంబర్లో అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం

సెప్టెంబర్లో  సీఎం రేవంత్ రెడ్డి  అల్వాల్ టిమ్స్ ను  ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.  అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన..సెప్టెంబరులోగా ఆస్పత్రి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సనత్ నగర్ ఆసుపత్రి జూన్ 2న ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల కోడ్ వల్ల ఆసుపత్రి నిర్మాణ పనులలో జాప్యం జరిగింది శరవేగంగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.గ్రేటర్ హైదరాబాద్ లోని 4 టిమ్స్ ఆస్పత్రులు త్వరగా పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు  కోమటిరెడ్డి.కాంగ్రెస్ హయాంలోనే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు కోమటిరెడ్డి

ALSO READ | Formula E Car Race Case: కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు

ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఏసీబీ తన పని తను చేసుకోపోతుందన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.  తమకు వ్యక్తిగతంగా పార్టీలతో వ్యక్తులతో  శత్రుత్వం లేదన్నారు.  చట్టానికి ఎవరూ అతీతులు కారని... ఈ ఫార్ములా రేసింగ్ తో పాటు అనేక అంశాలలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.  కేటీఆర్ ఈ ఫార్ములాకి అంశాన్ని న్యాయస్థానం చూసుకుంటుందన్నారు.