టిమ్స్ ఆస్పత్రి పనులు ఆలస్యం కావొద్దు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టిమ్స్ ఆస్పత్రి  నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నాణ్యమైన విద్యా, వైద్యం   అందుబాటులో ఉండలనేదే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. 2025 జూన్ 2న ఎల్బీనగర్ టిమ్స్ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.  

తెలంగాణలో ఎమర్జెన్సీ సర్వీస్ ప్రతి పేద వాళ్లకు  అందుబాటులో ఉండేలా ప్రభుత్వం హైదరాబాద్ నలుమూలల టిమ్స్ హాస్పిటల్స్  నిర్మాణం చేస్తుందన్నారు. పేదలు హాస్పిటల్ కు వెళితే 5 నుంచి 10 లక్షల రూపాయల ఖర్చవుతుందని.. పేదలకు భారం కావొద్దనే మల్టీ  స్పెషాలిటీ హాస్పిటల్స్  జాతీయ రహదారుల అనుసంధానం చేస్తూ నిర్మాణం  చేస్తున్నామన్నారు కోమటిరెడ్డి.

ALSO READ | ఎర్రచందనం స్మగ్లర్కు నేషనల్ అవార్డా.?.. పోలీస్ విలనా : మంత్రి సీతక్క

టిమ్స్ హాస్పిటల్స్  అందుబాటులోకి వస్తే పేదలకు  ఆరోగ్యంపై భరోసా వస్తుందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.   ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు.  మూసీ ప్రక్షాళన జరిగితే  నల్గొండ రైతుల జీవితాలు మారుతాయన్నారు.  ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా  మూసీ ప్రాజెక్ట్ ఆగదని.. త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలవుతుందన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.