హైదరాబాద్: తెలంగాణలోని రోడ్ల పరిస్థితిపై అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. రోడ్ల దుస్థితిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్లపై అడుగడుగునా గుంతలేనని.. రోడ్లపై కనీస అవగాహన బీఆర్ఎస్కు ఉందా అని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదని.. వాళ్లంతా ధ్యాస అంతా కమిషన్లు వచ్చే కాళేశ్వరం మీదేనని సెటైర్ వేశారు.
ఏడు ఏళ్లు అయిన ఉప్పల్ నారపల్లి ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయలేదని.. మేం అధికారంలోకి రాగానే రోడ్డను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్-విజయవాడ హైవేను సిక్స్ వేగా మారుస్తున్నామన్నారు. పదేళ్లలో కోకాపేట భూములను వందల కోట్లకు అమ్ముకున్నారు.. కాంగ్రెస్ నిర్మించిన లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రపంచస్థాయి సౌకర్యాలతో రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నామని చెప్పారు.
Also Read :- కూర్చొకపోతే సస్పెండ్ చేస్తా
నాలుగు ఏండ్లలో రూ.36 కోట్లతో ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్డు నిర్మి్స్తామన్నారు. వచ్చే మార్చి నాటికి ఆర్ఆర్ఆర్ భూసేకరణ పూర్తి అవుతోందని పేర్కొన్నారు. హరీష్ రావుకు దబాయించడమే తెలుసని.. ఆయనకు పని చేయడం చేతకాదని విమర్శించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు సరిగ్గా లేదని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ వ్యవహరాల మంత్రి శ్రీధర్ బాబును కోరారు.