భౌతిక దాడులు సహించం..  చట్టం తన పని తాను చేసుకుపోతుంది: మంత్రి కోమటిరెడ్డి ట్వీట్​

హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​వేదికగా స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని పేర్కొన్నారు.

ALSO READ | మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవలు.. మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు