కేసీఆర్ ఫాంహౌస్కు రోడ్లు వేసుకున్నారు.. ఓఆర్ఆర్ అమ్ముకున్నారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • నాలుగేండ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి 
  • వచ్చే మార్చిలోగా భూసేకరణ
  • కేసీఆర్ ఫాంహౌస్ కోసం 600 కోట్లతో రోడ్లు వేసిండ్రు

వచ్చే మార్చి నాటికి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ కంప్లీట్ చేసి పనులు ప్రారంభిస్తామని, నాలుగేండ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో రోడ్లను విధ్వంసం చేశారని ఫైర్​అయ్యారు.  

అసెంబ్లీలో కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘బీఆర్ఎస్ కు రోడ్లపై అవగాహన లేదు. ఉప్పల్ ప్లై ఓవర్ ను ఆరేండ్లు ఖాళీగా పెట్టారు. గత పాలకులకు ఎంతసేపు పైసలు వచ్చే కాళేశ్వరం తప్ప రోడ్లను పట్టించుకోలేదు. కమీషన్ తీసుకుని కూలిపోయే కాళేశ్వరం కట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం నాలుగు లైన్ల రోడ్లను ఆరు వందల కోట్లతో వేసుకున్నారు. లక్ష కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకున్నారు.

ALSO READ | యాదవుల సమస్యలు పరిష్కరించండి: సీఎంకు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేల విజ్ఞప్తి

హరీశ్​రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెల్వదు.  నేను మాట్లాడుతుండగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవడం లేదు. ఆయనకు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే తెలుసు. రోడ్లు వేయడం చాతకాదు.. కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు’ అని మండిపడ్డారు.