ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కి సమయం దగ్గరపడుతున్న క్రమంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వెలవడ్డ ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠను మరింత పెంచాయి.పలు ఎగ్జిట్ పోల్స్ కూటమిదే అధికారమని వెల్లడించగా, ఇంకొన్ని అధికార వైసీపీకే ప్రజలు పట్టం కట్టారని వెల్లడించాయి. ఈ క్రమంలో జనాల్లో మరింత కన్ఫ్యూజన్ నెలకొంది. జూన్ 4న వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతాయన్న నరాలు తెగే ఉత్కంఠ మధ్య తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో జగనే మళ్ళీ సీఎం అని అన్నారు. గతంలో కూడా కోమటిరెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఫలితాలు మరో రెండు రోజుల్లో రానున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.ఏపీలో వైసీపీదే విజయం అని చెప్పడానికి తన బంధువులు, స్నేహితులు నుండి వచ్చిన సమాచారమే కారణమని అన్నారు కోమటిరెడ్డి.