అసెంబ్లీ నుండి కిమ్స్ హాస్పిటల్ బయలుదేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...

సంధ్యా థియేటర్ ఘటనలో విషమ పరిస్థితిలో వైద్యం పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని  వారి కుటుంబాన్ని పరామర్శించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిమ్స్ ఆసుపత్రికి బయలు దేరారు. అసెంబ్లీలో సంధ్య థియేటర్ తొక్కిసలాటపై చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు కిమ్స్ ఆస్పత్రికి బయలుదేరారు. చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ కు ఆరోగ్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని అసెంబ్లీ  వేదికగా ప్రకటించారు మంత్రి. 

 అదే విధంగా తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద శ్రీ తేజ్ కుటుంబానికి సాయం చేస్తామని ప్రకటించారు. 25 లక్షల చెక్కును వారి కుటుంబానికి ఇవ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. హాస్పిటల్ కి వెళ్లి చెక్కును వారి తండ్రికి ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ALSO READ | సంధ్య థియేటర్ ఘటనపై సమగ్ర విచారణ జరగాలి: అక్బరుద్ధీన్