నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాను ఒక శాసనసభ్యుడిగా గుడివాడ ప్రజలకు సమాధానం చెబుతా కానీ, ఎవరో వచ్చి మాట్లాడితే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మంత్రి నాని ఈరోజు నియోజకవర్గంలోని గుడ్లవల్లేరులో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
‘గతంలో చంద్రబాబు ఆయన పార్టనర్ పేకాట క్లబ్బులు నడిపించారు. వాటన్నింటిని జగన్ మోహన్ రెడ్డి మూయించారు. మేం డబ్బులు తీసుకొని మాట్లాడే వాళ్లం కాదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. జగన్ మోహన్ రెడ్డి మంచి పాలన అందిస్తే.. రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకుంటానని నువ్వే అన్నావు. శివలింగాలను బోడిలింగాలతో పోల్చడం నీకే చెల్లుతుంది. దేవుడి మీద మేం అటువంటి మాటలు మాట్లాడం. రాజకీయ వేశ్యలాగా మాట్లాడుతున్నావు. శివలింగాలు ఎవరో, బోడి లింగాలు ఎవరో ప్రజలే తేల్చారు. నువ్వు బోడి లింగం కాబట్టే.. నిన్ను పోటీ చేసిన రెండు చోట్లా ఓడించి ఇంట్లో కూర్చొబెట్టారు. వకీల్ సాబ్ చెప్పమన్నాడని చెప్పు అంటున్నావు కదా.. వకీల్ సాబ్ ఎవరో జగన్ మోహన్ రెడ్డికి ఎలా తెలుస్తుంది? వకీల్ సాబ్ అని నువ్వు అనుకుంటున్నావు.. జనాలు మాత్రం నిన్ను షకీలా సాబ్ అనుకుంటున్నారు. తొడ, మెడ రుద్దుకుంటే జనాలు వింటారనుకుంటున్నావా? నీలాంటి యాక్టర్లు రోడ్ల మీద చాలా మంది తిరుగుతుంటారు. నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అసెంబ్లీ ముట్టడిస్తే ఎవరు ఊరుకుంటారు? నాలుగు పార్టీలు కలిసి పోటీచేస్తే ఒక్క సీటు గెలవలేకపోయావు. సిగ్గుండాలి మాట్లాడటానికి. నువ్వు గుర్తించాలంటే.. కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని నీ పార్టీలో చేరి.. ఆరు చోట్ల పోటీ చేసి ఆరు చోట్లా ఓడిపోవాలా? చంద్రబాబును రక్షించుకోవడం కోసం ఈయన వెనకేసుకొస్తున్నారు. తిరుపతిలో పోటీ చేస్తానన్నావ్ ఏమైంది? హైదరాబాద్‌లో పోటీ చేస్తానన్నావ్ ఏమైంది? నీ కథలన్నీ బీజేపీ వాళ్లకు కూడా తెలుసు. ప్యాకేజీల కోసమే నీ నాటకాలని ఏపీ ప్రజలందరికీ తెలుసు’ అని నాని అన్నారు.
For More News..
అభిమానులారా క్షమించండి.. నేను పార్టీ పెట్టడం లేదు
న్యూఇయర్ పార్టీకి డబ్బులివ్వలేదని నానమ్మను చంపిన మనవడు
భారత్‌లో ఆరు కొత్త స్ట్రెయిన్ కేసులు.. హైదరాబాద్‌లో రెండు..
