రైతుల సంతోషమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

  • మంత్రి జూపల్లి కృష్ణారావు

పానగల్, వెలుగు: రైతులు సంతోషంగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్​ మహా జన సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు చూసి చలించిన సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. పీఏసీఎస్​ పరిధిలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగిందని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని రైతులకు  ప్రభుత్వం త్వరలోనే రుణమాఫీ చేస్తుందన్నారు.

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం పీఏసీఎస్​ ఆధ్వర్యంలో రూ.10 లక్షల రుణం ఇస్తారని, రైతుల డెవలప్​మెంట్​ కోసం సీఎం రేవంత్ రెడ్డి  నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు  జడ్పీ హైస్కూల్ లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  పదో తరగతి విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ పంపిణీ చేశారు.

డీసీసీబీ చైర్మన్  విష్ణువర్ధన్ రెడ్డి, పీఏసీఎస్​ వైస్  చైర్మన్  బాలయ్య, మాజీ జడ్పీటీసీ రవి, ముంత భాస్కర్, మాజీ ఎంపీపీ వెంకటేశ్ నాయుడు, పుల్లారావు, రాము యాదవ్, గోవర్ధన్ సాగర్, మధుసూదన్ రెడ్డి, డీఈవో గోవిందరాజు, ఎంఈవో శ్రీనివాసులు, తహసీల్దార్  సుభాశ్ నాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.