బంగారు పల్లెంలో ఇచ్చింది అప్పులు, మిత్తీలే : మంత్రి జూపల్లి కృష్ణారావు

  • 65 ఏండ్లలో అయిన అప్పు ఒక ఎత్తయితే.. పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో చేసిన అప్పు మరో ఎత్తు

వనపర్తి, వెలుగు : పదేండ్లు పాలించిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ బంగారు పల్లెంలో ఇచ్చింది అప్పులు, మిత్తీలేనని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ రాక ముందు కాంగ్రెస్‌‌‌‌, టీడీపీలు 65 ఏండ్లు పాలించి రూ.69 వేల కోట్ల అప్పు చేస్తే, ఏడాదికి రూ.6 వేల కోట్ల ఈఎంఐ కట్టేవారని, పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేస్తే ప్రస్తుతం తాము రూ.6 వేల కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు. ఆదివారం వనపర్తి జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అమరుల ఆశయం, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామన్నది గుర్తుంచుకోవాలన్నారు.

 కేసీఆర్‌‌‌‌ హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకే ప్రగతిభవన్‌‌‌‌లోకి వెళ్లే అవకాశం ఉండేది కాదని.. కానీ తాము అధికారంలోకి వచ్చాక ప్రజాభవన్‌‌‌‌ ముందు ముళ్లకంచె తొలగించి అందరినీ రానిస్తున్నామన్నారు. పదేండ్లు సక్రమంగా పాలిస్తే ప్రజలు ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు. గతంలో రెండు సార్లు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు అధికారం ఇచ్చినా అమరుల ఆకాంక్షలు నెరవేర్చలేదని, ఉద్యమకారులను అణచివేశారని మండిపడ్డారు. అధికారంలో కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు పనిగట్టుకుని కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారన్నారు.

 అంతకుముందు నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలక్టర్‌‌‌‌ ఆదర్శ్‌‌‌‌ సురభితో కలిసి పెద్దమందడి మండల కేంద్రం నుంచి నేషనల్‌‌‌‌ హైవే మోజర్ల వద్ద హైలెవల్ బ్రిడ్జి, చిట్యాల వద్ద ఓవర్ హెడ్‌‌‌‌ ట్యాక్‌‌‌‌, వనపర్తిలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, నీటి సరఫరా, మహిళా సమాఖ్య భవనం వంటి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌‌‌‌ విష్ణువర్ధన్‌‌‌‌రెడ్డి, లైబ్రరీ సంస్థ అధ్యక్షులు రియాజ్, గోవర్ధన్, మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ మహేశ్‌‌‌‌ పాల్గొన్నారు.