రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన : జూపల్లి కృష్ణారావు

  • ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

పానగల్, వెలుగు: మండలంలోని కేతేపల్లిలో మంత్రి జూపల్లి కృష్ణారావు రూ. కోటి 99 లక్షలతో ఆర్ అండ్ బీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి జూపల్లి సమక్షంలో వైద్యాధికారులు ఆరోగ్య ఉప కేంద్రం భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇండ్లను ఇస్తుందన్నారు గ్రామంలో ఉన్న స్మశాన వాటిక లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా రూ. 20 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రవికుమార్, డాక్టర్ పగడాల శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి,రాజు, విష్ణు, మాజీ సర్పంచ్ పి కళావతమ్మ పాల్గొన్నారు.