ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నయ్

గద్వాల, వెలుగు : కాంగ్రెస్  ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ కుట్రలు చేస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. శుక్రవారం ధరూర్  మండలం రేవులపల్లి, చింతరేవుల, ఉప్పేరు గ్రామాల్లో కాంగ్రెస్  పార్టీ అభ్యర్థి మల్లు రవితో కలిసి రోడ్ షో, కార్నర్  మీటింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్  ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ప్రతిపక్షాలు గ్లోబెల్స్​​ ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్  హామీ ఇచ్చిందంటే తప్పకుండా అమలు చేసి తీరుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్  పార్టీకి ఆదరణ వస్తుందని, నాగర్ కర్నూల్  ఎంపీగా మల్లు రవి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జడ్పీ చైర్​పర్సన్  సరిత, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ బాబు, బండారి భాస్కర్  పాల్గొన్నారు.

త్వరలోనే సంక్షేమ పథకాలు..

పాలమూరు : కాంగ్రెస్  ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలన్నీ త్వరలోనే అందరికీ అందుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్  హాల్​లో గౌడ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతుందని విమర్శించారు. చాయ్ వాలా పేరుతో వేల కోట్ల ధనాన్ని గుజరాత్ కు తరలిస్తున్నారన్నారు.

ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పాలమూరు ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​ రెడ్డి, మున్సిపల్  చైర్మన్  ఆనంద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.