ORR అమ్మేసి రైతు బంధు.. బీఆర్ఎస్‎పై నిప్పులు చెరిగిన మంత్రి జూపల్లి

మహబూబ్‎నగర్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఆర్ఆర్ఆర్‎ను అమ్మేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం అమలు  చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మహబూబ్ నగర్‎లో ప్రభుత్వం రైతు పండగ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా శనివారం (శనివారం 30) రైతు పండగ ముగింపు వేడుక నిర్వహించారు. 

ALSO READ | రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తా : బీర్ల ఐలయ్య

ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందెవరు..?  నెలకు రూ.6 వేల వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి తెచ్చిందెవరు..? అంటూ బీఆర్ఎస్‎ను విమర్శించారు. గత ప్రభుత్వ బీఆర్ఎస్ తీరు వల్ల రాష్ట్రంలో  అప్పుల్లో కూరుకుపోయిన.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేశామని చెప్పారు. ప్రభుత్వానికి భారీగా అప్పులున్నప్పటికీ రైతుల కోసం రూ.2 లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. రుణమాఫీ కోసం ఇప్పటికే రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం.. మిగిలిన వారికి త్వరలోనే రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.