బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయి : జూపల్లి కృష్ణారావు

కోడేరు/ విపనగండ్ల ,వెలుగు: దేశంలో బీజేపీ 400 సీట్లు గెలిస్తే ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్లు   తొలగిస్తుందని  మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన  ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడేరు మండల కేంద్రంలో  కాంగ్రెస్  ముఖ్య కార్యకర్తల  సమావేశానికి, విపనగండ్ల మండల కేంద్రంలో  గోదాల బీరయ్య యాదవ్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించారు.  

ముఖ్యఅతిథిగా హాజరైన జూపల్లి మాట్లాడారు.  అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్  రావాలన్నారు. అందుకు ప్రతి కార్యకర్త సైనికుల పనిచేస్తూ మన కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్.మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామ్మోహన్​ రావు,   భస్తిరాం, మహేశ్వర్ రెడ్డి,వేణుగోపాల్, ఎల్లపాగ మశన్న,   జగదీశ్వరుడు, రాము యాదవ్ పాల్గొన్నారు.