టూరిజం క్లబ్ ఏర్పాటులో జిల్లాకు రాష్ట్ర అవార్డు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: యువ టూరిజం క్లబ్స్ ద్వారా తెలంగాణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ, పర్యాటకంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో విశేష కృషి చేసినందుకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయికి మంత్రి జూప‌‌ల్లి  కృష్ణారావు అవార్డు అందజేశారు. శుక్రవారం హైదరాబాద్‌‌లో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో కలెక్టరేట్ కు మంత్రి అవార్డు అందజేశారు.

జిల్లాలోని అన్ని కాలేజీలు, స్కూల్స్,  పాలమూరు విశ్వవిద్యాలయం, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సుమారు 1350 కి పైగా యువ టూరిజం క్లబులను ఏర్పాటు చేశారు.  పర్యాటక, సాంస్కృతిక, సంప్రదాయాలు, వారసత్వం పై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ క్లబ్ ల ముఖ్య ఉద్దేశం . జిల్లా కలెక్టర్ కు రాష్ట్రస్థాయి అవార్డు రావడం పట్ల  జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పలువురు అభినందించారు.