పెద్ద కొత్తపల్లి మండలంలో తహసీల్దార్ భవనం ప్రారంభం

కోడేరు, వెలుగు: పెద్ద కొత్తపల్లి మండలంలో కొత్త నిర్మించిన తహసీల్దార్ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

ఎంపీపీ సహకారంతో మండలంలోని గ్రామ పంచాయతీ వర్కర్లకు కొత్త బట్టలు, దివ్యాంగులకు త్రీ వీలర్ సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని ఎంపీపీ, ఎంపీటీసీలకు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో నాగరాజు, తహసీల్దార్ యూసుఫ్ అలీ, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.