రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించండి : జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు :  రైతులకు సకాలంలో వడ్ల డబ్బులు చెల్లించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. సోమవారం పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మల్లేశ్వరం వెళ్లే దారిలో బ్రిడ్జిపై రైతులు ఆరబోసిన వడ్లను పరిశీలించారు. వడ్ల కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయా. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో వడ్లకు సంబంధించిన డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

 అనంతరం కొల్లాపూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో మార్నింగ్ వాక్ లో పాల్గొని చిన్నారులతో కలిసి సరదాగా ఆడుతూ సందడి చేశారు. యువతకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. రామన్ గౌడ్, వంగ భాస్కర్ గౌడ్, వంగ రాజశేఖర్ గౌడ్, ధర్మ తేజ, రామదాసు, నరసింహ యాదవ్, ఎర్ర శ్రీను పాల్గొన్నారు.