వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి : జూపల్లి కృష్ణారావు

  •      అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలు  

కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.  కొల్లాపూర్ పట్టణంలో పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి  శనివారం ఆయన పర్యటించారు.  ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.  

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీవో ఆఫీస్ ఆవరణ చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.  సీసీ రోడ్ల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు రూపొందించి సత్వరమే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కొల్లాపూర్ పట్టణ కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.