ప్రతి జిల్లాకో పారా మెడికల్ కాలేజీ : దామోదర రాజనర్సింహ

రాయికోడ్(న్యాల్ కల్ ), వెలుగు: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారా మెడికల్, నియోజకవర్గం పరిధిలో నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఈ పాటికే సన్నద్ధం అయ్యిందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. న్యాల్ కల్ మండలం రాఘవపూర్– -హుమ్నపూర్ గ్రామ శివారులోని ‘పంచవటి పుణ్యక్షేత్రం’లో రూ.8 కోట్ల భక్తుల ఆర్థిక సాయంతో నిర్మించిన ‘శ్రీ కాశీనాథ్ బాబా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’ను నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. 

 అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. మంత్రిగా ఉన్న ప్రతిసారి తనకు సేవ చేసే భాగ్యం రావడం సంతోషకరమన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉన్న  అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడి ఉందన్నారు. నారాయణఖేడ్​ను అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో  కాశీనాథ్ బాబా, మాజీ ఎమ్మెల్యే విజయ పాల్ రెడ్డి, సంగ్రామ్, దత్తగిరి మహారాజ్,మల్లయ్యగిరి మహారాజ్ పాల్గొన్నారు.