సంగారెడ్డిలో 500 పడకల ఆస్పత్రిని నిర్మిస్తాం.. మంత్రి దామోదర

సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజ నరసింహ  పర్యటించారు.  జహీరాబాద్​ ఏరియా ఆస్పత్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలు తీర్చేందుకు 500 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు.  తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి నర్సింగ్​ కాలేజీ..  ప్రతి జిల్లాకు మొబైల్​ క్యాన్సర్​ సేవలు ప్రారంభిస్తామన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్​ ఎంపీ సురేష్ శెట్కార్, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు. జహీరాబాద్​ ప్రాంతం NIMZ ద్వారా  అభివృద్ధి చెందుతుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. యువకులకు స్కిల్​ డెవలప్​ మెంట్​ చాలా అవసరమన్నారు.  రుణ మాఫీ విషయంలో మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అర్హులైన ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తామన్నారు.