హైదరాబాద్ రాజధాని అనలేదు : వైవీ వ్యాఖ్యలపై బొత్స ఏమన్నారంటే

ప్రభుత్వంపై ఏడవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం(ఫిబ్రవరి 14) మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మా పార్టీ విధానం కాదని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారాయన. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమని.. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరని చెప్పారు. 

మా నాయకుడు సీఎం జగన్ ఒకటే చెప్తున్నాడని... మేము మంచి చేశాం అనుకుంటేనే మళ్లీ నాకు అవకాశం ఇవ్వండి అంటున్నారని వెల్లడించారు. అలా అనడంలో తప్పు ఏముందని అని మంత్రి ప్రశ్నించారు.

గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. ప్రతిపక్షం చేసే చౌకబారు విమర్శలకు మేం స్పందించమన్నారు. మేము ప్రజలు ఏం మేలు చేశామో అది చెప్పే ఓట్లు అడుగుతామని.. ఇలాంటి జిమ్మిక్కులు మాకు అవసరం లేదని తెలిపారు.