- ఇన్ ఫ్లేషన్ పెరగడంతో పడుతున్న ఇండెక్సులు
న్యూఢిల్లీ: సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం సెషన్‌లోనూ నష్టపోయాయి. ఇన్‌ఫ్లేషన్ పెరగడంతో పాటు, గ్లోబల్‌గా ఒమిక్రాన్ భయాలు పెరుగుతుండడంతో ఇండెక్స్‌లు పడ్డాయి. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు వెళ్లిపోతుండడంతో పాటు, డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం కూడా నష్టాలను తెచ్చిపెట్టింది. సెన్సెక్స్ మంగళవారం 166 పాయింట్లు (0.29 శాతం) తగ్గి 58,117 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 43 పాయింట్లు (0.25 శాతం) నష్టపోయి 17,325 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో ఐటీసీ షేరు ఎక్కువగా నష్టపోయింది. ఇంట్రాడేలో 500 పాయింట్లు వరకు నష్టోయిన సెన్సెక్స్, సెషన్ ముగిసే నాటికి నష్టాలను తగ్గించుకోగలిగింది. ‘ఇన్‌ఫ్లేషన్ పెరగడంతో పాటు, ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవ్వడంతో ఫెడ్ పాలసీకి ముందు మన మార్కెట్లు నష్టపోతున్నాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం సుంకాలను తగ్గించినప్పటికీ, బేస్ ఎఫెక్ట్ కూడా తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఏడాది నవంబర్‌లో సీపీఐ ఇన్‌ఫ్లేషన్ 4.91 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ కూడా 14.23 శాతాన్ని తాకి 12 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేసిందని చెప్పారు. యూఎస్ ఫెడ్ మీటింగ్ బుధవారం ఉందని, దీనికి ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు. గ్లోబల్‌గా చూస్తే షాంఘై, టోక్యో, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో క్లోజవ్వగా, యూరప్‌లోని మెజార్టీ స్టాక్ ఎక్స్చేంజిలు పాజిటివ్‌గా ఓపెన్ అయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 10 పైసలు తగ్గి 75.88 వద్ద సెటిలయ్యింది.
లాభంతో ఆనంద్ రాఠి ఎంట్రీ..
ఆనంద్ రాఠి వెల్త్ షేర్లు మంగళవారం ఇష్యూ ధర రూ.550 కంటే 9 శాతం ఎక్కువ రేటుతో లిస్టింగ్ అయ్యాయి. రూ.602 వద్ద కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో లిస్టింగ్ అయ్యాయి. ఇంట్రాడేలో రూ. 615 వరకు పెరిగి, చివరికి 585 వద్ద క్లోజయ్యాయి.
నాట్కో చేతికి దాష్ ఫార్మా
యూఎస్‌కు చెందిన దాష్ ఫార్మాస్యూటికల్స్ ఎల్‌ఎల్‌సీని కొనేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని నాట్కో ఫార్మా పేర్కొంది. ఈ డీల్ విలువ 18 మిలియన్ డాలర్లు (రూ. 135 కోట్లు). తమ సబ్సిడరీ ద్వారా దాష్ ఫార్మాని కొనడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో నాట్కో ఫార్మా పేర్కొంది. ఫార్మాస్యూటికల్స్ సేల్స్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్‌లో దాష్ ఫార్మా బిజినెస్ చేస్తోంది.
