డిజిన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్‌లో కొనేందుకు ప్లాన్స్
సెంట్రికస్‌తో కలిసి పనిచేస్తున్న వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్
బిజినెస్‌డెస్క్, వెలుగు: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా ప్రభుత్వం అమ్మే కంపెనీలను కొనాలని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్లాన్స్ వేస్తున్నారు. దీని కోసం ఏకంగా రూ. 74 వేల కోట్ల(సుమారు10 బిలియన్ డాలర్ల)ను ఇన్వెస్ట్ చేయనున్నారు. లండన్ కంపెనీ సెంట్రికస్ అసెట్ మేనేజ్‌మెంట్‌తో కలిసి అనిల్ అగర్వాల్ కంపెనీ వేదాంత రిసోర్సెస్ ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను జరపనుంది. ప్రభుత్వ కంపెనీలలో వాటాలను అమ్మడం ద్వారా రూ. 2.1 లక్షల కోట్లను సమీకరించాలని గవర్న్‌మెంట్ చూస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గ్రోత్ అవకాశాలున్న కంపెనీలలో ప్రభుత్వ వాటాలను కొనాలని అనిల్ అగర్వాల్ ఎదురు చూస్తున్నారు.
బిలీనియర్‌గా మారింది అలానే..
అనిల్ అగర్వాల్ బిజినెస్ ప్రయాణమే వేరొక కంపెనీని కొనడం ద్వారా జరిగిందని చెప్పొచ్చు. నష్టాల్లో ఉన్న కంపెనీలో ఇతరులు చూడనది ఆయన చూసే వారు. భారత్ అల్యూమినియం, హిందుస్తాన్ జింక్ వంటి నష్టాల్లో ఉన్నా ప్రభుత్వ కంపెనీలను కొని వాటిని లాభాల బాట పట్టించిన రికార్డ్ అనిల్ సొంతం. వేదాంత రిసోర్సెస్ కింద ప్రస్తుతం మెటల్స్, మైనింగ్స్, పవర్ సెక్టార్, గ్యాస్ వంటి సెగ్మెంట్లలో వ్యాపారాలను ఆయన చేస్తున్నారు. పబ్లిక్ కంపెనీల విలువను అన్‌లాక్ చేస్తే అది దేశంలో ఇండస్ట్రియలైజేషన్‌కు కీలకంగా పనిచేస్తుందని అగర్వాల్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ కంపెనీలను కొనుగోలు చేసి ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ ద్వారా వాటిని మార్చాలని ఈ బిలీనియర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు.
వేదాంతలో 4.98 శాతం వాటా కొన్న ప్రమోటర్లు
వేదాంత లిమిటెడ్‌లో ప్రమోటర్ అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ గురువారం 18.5 కోట్ల షేర్లు (4.98 శాతం వాటా) కొంది. వేదాంత లిమిటెడ్‌లోని ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,959 కోట్లు వెచ్చించి ఈ షేర్లను కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో వేదాంత లిమిటెడ్‌లో వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాటా 55.1 శాతానికి పెరిగింది. అంతకు ముందు సెప్టెంబర్ చివరి నాటికి ఈ వాటా 50.13 శాతమే. క్రీపింగ్ ఎక్విజిషన్ ద్వారా ప్రతీ ఏడాదీ 5 శాతం వాటా పెంచుకోవడానికి ప్రమోటర్లకు అనుమతి ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎక్విజిషన్‌కు ఎలాంటి ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వేదాంత లిమిటెడ్‌ను ఇండియాలోని స్టాక్ ఎక్స్చేంజ్‌ల నుంచి డీలిస్ట్ చేయాలనే ప్రమోటర్ ప్రపోజల్ కొంత కాలం కిందటే ఫెయిలయింది. షేర్ ఒక్కింటికి రూ. 87.5 చొప్పున చెల్లించి డీలిస్ట్ చేయాలని అప్పట్లో ప్రయత్నించారు. కానీ, అవసరమైనన్ని షేర్లను ప్రమోటర్లు కొనుగోలు చేయలేకపోయారు. మరోవైపు గవర్నమెంట్ నుంచి భారత్ పెట్రోలియమ్ కార్ప్ లిమిటెడ్ (బీపీసీఎల్)ను కొనాలని వేదాంత గ్రూప్ ఓనర్ అనిల్ అగర్వాల్ పట్టుదలతో ఉన్నారు. ఈ ఎక్విజిషన్‌కు అవసరమైన డబ్బు సమకూర్చుకుంటున్నారు. ఈక్విటీ, అప్పుల రూపంలో 8 బిలియన్ డాలర్లు సమీకరించాలని ప్రయత్నిస్తున్నారు. బీపీసీఎల్‌లో గవర్నమెంట్ వాటా 53 శాతం. ఈ వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 45 వేల కోట్లు వస్తుందని అంచనా. బీపీసీఎల్‌లో 75 శాతం వాటా (53 శాతం ప్రభుత్వ వాటా, 22 శాతం ఓపెన్ ఆఫర్)చేజిక్కించుకోవడానికి వేదాంత గ్రూప్‌కు సుమారు రూ. 64 వేల కోట్ల నుంచి రూ. 97 వేల కోట్ల దాకా అవసరమవుతుందని జేపీ మోర్గాన్ ఒక రిపోర్టులో తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో వేదాంత లిమిటెడ్ లాభం 61.8 శాతం తగ్గి రూ. 824 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీ నికర లాభం రూ. 2,158 కోట్లు.
For More News..
ఒక్క మ్యాచ్‌లో ఫెయిలైతే తప్పిస్తారా?
రాత పరీక్ష లేకుండా బ్యాంక్ జాబ్
విరాట్ నావల్లే అవుట్ అయ్యాడు.. లేకపోతే మ్యాచ్ పోయేది కాదు
పార్కింగ్ ప్లేస్‌లు లేవు కానీ.. బండ్లకు ఫైన్లు
