ఉత్తరాదిని వణికిస్తున్న చలి తీవ్రత

ఉత్తరాదిని వణికిస్తున్న చలి తీవ్రత

ఉత్తరాదిలో చలి తీవ్రత పెరిగింది. చలి తీత్రతకు శీతల గాలులు కూడా తోడుకావడంతో జనం వణికిపోతున్నారు. సిమ్లా, కశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది.  ఢిల్లీలో కూడా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నవెూదవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సిమ్లాను తలపిస్తోంది. ఢిల్లీలోని జాఫర్‌పూర్‌లో సాధారణం కన్నా 6 డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు నవెూదవుతున్నాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టంగా నవెూదవుతూ.. గత పదేళ్ల రికార్డులను బ్రేక్ చేశాయి. ఇక్కడ 0.4 డిగ్రీల ఉష్ణోగ్రత నవెూదైంది. జలంధర్‌లో 1.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. బీహార్‌ లో  4డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజస్థాన్‌లో గడచిన 24 గంటల్లో అనేక నగరాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నవెూదయ్యాయి. మౌంట్‌ అబూ, చందన్‌ తదితర ప్రాంతాల్లో మైనస్‌ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.