టూల్స్​ & గాడ్జెట్స్ : మినీ కుక్కర్​: ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళచ్చు..

టూర్లకు వెళ్లినప్పుడు రెగ్యులర్​గా ఎదురయ్యే సమస్య.. నచ్చిన ఫుడ్​ దొరక్కపోవడమే. అలాగని కావాల్సింది వండుకుని తిందామంటే స్టవ్​, గ్యాస్​ అంటూ పెద్ద సెటప్​ అవసరం అవుతుంది. అందుకే ఇన్​స్టాకప్ప అనే కంపెనీ సింపుల్​గా వంట చేసుకోవడానికి పోర్టబుల్​ మల్టీ ఎలక్ట్రిక్​ కెటిల్​​ని తీసుకొచ్చింది. ఇందులో పాలు మరగబెట్టుకోవచ్చు. టీ, కాఫీ లాంటివి చేసుకోవచ్చు. గుడ్లు ఉడికించుకోవచ్చు. అన్నం, కూరలు కూడా వండుకోవచ్చు.

ప్యాక్​లో వచ్చే లీటర్​ కెపాసిటీ నాన్-స్టిక్ ఇన్నర్ పాట్ వాడి రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఇది డ్రై బాయిల్ ప్రొటెక్షన్​తో వస్తుంది. అంటే కెటిల్​ ఖాళీగా ఉన్నప్పుడు ఆన్​ చేస్తే.. ఆటోమేటిక్‌‌‌‌గా ఆఫ్​ అయిపోతుంది. దీని బరువు కూడా చాలా తక్కువ.

కాబట్టి ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవాళ్లకు ఇది బాగా యూజ్​ అవుతుంది. పిల్లలకు బయటి ఫుడ్​ పెట్టకుండా దీంతో ఎప్పటికప్పుడు ఫ్రెష్​గా ఫుడ్​ తయారుచేసి పెట్టొచ్చు. 
ధర : రూ. 1,234