సీఎం రేవంత్​తో అసద్​ భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డితో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో హైడ్రా కూల్చివేతలు, ఓల్డ్ సిటీ, నాంపల్లిలో ఇటీవల నెలకొన్న పరిస్థితులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం.

 మూసీ ప్రక్షాళనలో భాగంగా చేపడుతున్న కూల్చివేతల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం పేదల ఇండ్లకు అధికారులు మార్క్ చేశారని సీఎం దృష్టికి ఒవైసీ తీసుకెళ్లినట్టు తెలిసింది. ఆ బాధితులను ఆదుకోవాలని కోరినట్టు సమాచారం. నాంపల్లిలో కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య జరిగిన ఘర్షణపై కూడా చర్చించినట్టు తెలిసింది. కాగా, సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు వచ్చారు.