- 1.86 లక్షల టన్నులకు టెండర్
- ఆరు నెలలుగా1.20 లక్షల టన్నులకు పేమెంట్
- ఇంకా 66 వేల టన్నులు పైసలు పెండింగ్
- ఒక్క మిల్లులోనే 13 వేల టన్నులకు పైగా వడ్లు
యాదాద్రి, వెలుగు : రూ.10 కోట్ల విలువైన వడ్లను ఓ మిల్లర్ దారిమళ్లించిన ఘటన బయటపడడంతో మిగిలిన మిల్లర్లపై అనుమానాలు మరింత పెరిగాయి. సీజన్లు గడుస్తున్నా టెండర్‌కు సంబంధించిన 2022-23 యాసంగి సీజన్వడ్లు మిల్లర్లు ఇస్తలేరు. దీంతో టెండర్లో వడ్లు తీసుకున్న కాంట్రాక్టర్.. ప్రభుత్వానికి పైసలు ఇస్తలేడు. ఈ పరిణామాలతో ఇంతకీ మిల్లుల్లో వడ్లు ఉన్నాయా..? లేవా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా జిల్లాలోని ఒక మిల్లులో పెద్ద ఎత్తున వడ్లు పెండింగ్ ఉండడంపై చర్చ తీవ్రంగా సాగుతోంది.
యాదాద్రిలో 1.86 లక్షల టన్నులు..
2022--–23 యాసంగి సీజన్లో యాదాద్రి జిల్లాలోని 40 సీఎంఆర్ మిల్లులకు 4,11,187 టన్నులవడ్లను సివిల్‌సప్లయ్ డిపార్ట్మెంట్అప్పగించింది. ఆ తర్వాత రెండు సీజన్లు ముగిసినా సీఎంఆర్‌ను మిల్లర్లు అప్పగించలేదు. కొందరు అమ్ముకొని డబ్బు వాడుకుంటున్నారు. స్టాక్ మాత్రం ఉన్నట్టు చూపుతున్నారు. దీంతో మిల్లుల్లో ఉన్న వడ్లను జనవరి 2024లో ఈ టెండర్ ద్వారా విక్రయించింది. యాదాద్రి, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లోని మిల్లుల్లో పెండింగ్‌లో ఉన్న 3 లక్షల టన్నుల వడ్లను క్వింటాల్‌కు రూ.1,991 చొప్పున టెండర్ ద్వారా కేంద్రీయ బండార్ సంస్థ దక్కించుకుంది. ఇందులో 1.86 లక్షల టన్నుల వడ్లు యాదాద్రి జిల్లాకు చెందినవే ఉన్నాయి.
Also Read : ప్రజావాణి అర్జీలు .. సగం పెండింగ్‌లోనే
రూ.240 కోట్లు చెల్లింపు..
నిబంధనల ప్రకారం ఈ--–టెండర్లో వడ్లను దక్కించుకున్న సదరు సంస్థ మిల్లుల నుంచి మూడు నెలల్లో స్టాక్‌ను తరలించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే టెండర్దక్కించుకున్న సదరు సంస్థ మిల్లుల నుంచి వడ్లను తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో మిల్లుల్లో వడ్లు సరిగా లేకపోవడంతో టెండర్ దక్కించుకున్న కేంద్రీయ బండార్‌కు గడిచిన ఆరు నెలలుగా కొందరు మిల్లర్లు 1,20,713 టన్నులకు సంబంధించి రూ.240 కోట్లు మిల్లర్లు చెల్లించారు.
66 వేల టన్నులు పెండింగ్..
వడ్ల అప్పగించి, డబ్బులు చెల్లింపులు పోనూ జిల్లాలోని 39 మిల్లుల్లో రూ.133 కోట్ల విలువైన 66 టన్నులు వడ్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో టెండర్లో వడ్లు తీసుకున్న కాంట్రాక్టర్ ప్రభుత్వానికి పైసలు చెల్లించకుండా ఫిర్యాదు చేసింది. ఇందులో ప్రముఖ వ్యక్తికి చెందిన ఒక్క మిల్లులోనే రూ.26 కోట్ల విలువైన 13.311 టన్నుల వడ్లు పెండింగ్‌లో ఉన్నాయి.
బస్తాలు కౌంటింగ్చేసే పరిస్థితి లేదు..
టెండర్ దక్కించుకున్న సంస్థ ఫిర్యాదుతో మిల్లుల్లో వడ్లు ఉన్నాయా.. లేవా..? అన్న విషయం తెలుసుకోవడానికి సివిల్ సప్లయ్ ఆఫీసర్లు ఇటీవల ప్రయత్నించారు. అయితే మిల్లుల్లో వడ్ల బస్తాలు అడ్డదిడ్డంగా పడేయడంతో వాటిని లెక్కించలేకపోయారు. జిల్లాలోని గుండాల మండలం అనంతారంలోని ఎల్ఎన్ రెడ్డి బిన్ని రైస్‌మిల్లు జరిమానాతో కలిసి రూ.5.25 కోట్లు సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్కు చెల్లించాల్సి ఉంది. తాజాగా భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్లోని లక్ష్మీనర్సింహ ఆగ్రో మిల్లు ఓనర్ 2322--–23 సీజన్‌కు సంబంధించిన రూ.10 కోట్ల వడ్లు అమ్ముకున్నాడని తనిఖీల్లో వెల్లడైన సంగతి తెలిసిందే.