కొటబాటో: ఫిలిప్పీన్స్‌లో ఆదివారం ఉదయం మిలటరీ ప్లేన్ కుప్పకూలింది. సదరన్ ఫిలిప్పీన్స్‌లో టెర్రరిజంపై పోరాడేందుకు జాయింట్ టాస్క్ ఫోర్స్‌లో చేరేందుకు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సోల్జర్స్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీని వివరాలను ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ సిరిలిటో సొబెజనా మీడియాకు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లేన్‌లో 85 మంది ఉన్నారని చెప్పారు. దేశంలోని సదరన్ రీజియన్‌లో టెర్రరిస్టు గ్రూపుల ప్రభావం ఎక్కువని, ఆ ప్రాంతంలో ఫైట్ చేసేందుకు బేసిక్ మిలటరీ ట్రైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సైనికులను సీ130 ఫ్లైట్‌లో తీసుకెళ్తుండగా సడన్‌గా క్రాష్ అయిందని తెలిపారు. సులూ ప్రావిన్స్‌లోని జోలో ఐలాండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయిదన్నారు. క్రాష్ జరిగిన సైట్‌కు రెస్క్యూ టీమ్స్ చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 40 మందిని రెస్క్యూ చేసి, ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది.
ఈ ప్రమాదం జరగడానికి కారణం తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనలో ఎంత మంది మరణించారు, ఎంత మంది సేఫ్‌గా ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
