చాట్ జీపీటీ.. కొన్ని రోజులుగా టెక్నాలజీ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్)ని కనిపెట్టిన ఓపెన్ ఏఐ సంస్థ చెప్తున్నదాని ప్రకారం చాట్ జీపీటీ తక్కవ సమయంలో కావాల్సిన పనులన్నీ చేసిపెడుతుంది. చాట్ జీపీటీ రావడంతో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ల పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ, వెంటనే గూగుల్ ‘బార్డ్’ ఏఐని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ ఆధారిత సెర్చ్ టూల్ ని ఆచరణలోకి తీసుకొచ్చింది.
మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ టూల్ లో ఏఐ సెర్చ్ ఇంజిన్ ని యాడ్ చేశారు. దీనిద్వారా చాట్ జీపీటీ తరహా సేవలు పొందొచ్చు. అయితే, ఈ సేవలు ప్రస్తుతం వెయిట్ లిస్ట్ ప్రాసెస్ లో అందిస్తున్నారు. అంటే.. బింగ్ ఏఐ యాక్సెస్ కావాలనుకునేవాళ్లు మొదట వెయిట్ లిస్ట్ లో చేరాలి. తర్వాత మీ విడత వచ్చినప్పుడు యాక్సెస్ వచ్చినట్లు మైక్రోసాఫ్ట్ నుంచి మెయిల్ వస్తు్ంది.
