ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ భారత క్రికెట్ జట్టుకు పీడకలలా మారుతున్నాడు. కీలకమైన మ్యాచ్ ల్లో సెంచరీ కొడుతూ ఒంటి చేత్తో భారత్ ను నుంచి మ్యాచ్ లాగేసుకుంటున్నాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో సెంచరీ.. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ.. తాజాగా పింక్ బాల్ టెస్టులో సెంచరీ.. భారత బౌలింగ్ దళం అందరినీ పెవిలియన్ కు చేరుస్తున్న హెడ్ మాత్రం మన జట్టుకు కొరకరాని కొయ్యలా తయారవుతున్నాడు. ఇటీవలే ముగిసిన అడిలైడ్ టెస్టులో 140 పరుగులతో భారీ సెంచరీ చేసి ఆసీస్ కు విజయాన్ని అందించాడు.
భారత బౌలర్లు హెడ్ వికెట్ తీయడానికి తంటాలు పడుతున్న సమయంలో మైకేల్ వాన్ భారత జట్టుపై సెటైర్ విసిరాడు. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా గెలవగానే ప్రేక్షకులతో స్టేడియం నిండిపోయింది. ఈ ఫోటోను వాన్ ఎక్స్ లో షేర్ చేస్తూ హెడ్ ను ఆపాలంటే ఇలాంటి ఫీల్డ్ సెట్ ఉండాలి అని చెప్పుకొచ్చాడు. దీని ప్రకారం భారత బౌలర్లు హెడ్ వికెట్ తీయాలంటే భారీ సంఖ్యలో ఫీల్డింగ్ ఉండాలి అని భారత జట్టుపై కౌంటర్ విసిరాడు. అంతకముందు తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లోనూ హెడ్ 85 పరుగులు చేసి సెంచరీ చేజార్చుకున్నాడు.
ALSO READ | IND vs AUS: ఇదీ తెలుగోడి సత్తా.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన నితీష్ రెడ్డి
ఇక రెండో టెస్టు విషయానికొస్తే.. పింక్‌బాల్ పోరులో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగుల వద్ద ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 175 పరుగుల వద్ద అలౌటై.. కమ్మిన్స్ జట్టుకు 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆ టార్గెట్‌ను ఆసీస్ వికెట్లేమీ నష్టపోకుండా 20 బంతుల్లోనే చేధించింది.
Michael Vaughan on Team India's plan to stop Travis Head from scoring runs ??#AUSvIND #TravisHead #India #Australia #Sportskeeda pic.twitter.com/FizhhEAmiL
— Sportskeeda (@Sportskeeda) December 8, 2024