Virat Kohli: ఆ విషయంలో రూట్ కంటే కోహ్లీనే ఉత్తమ ఎంపిక: ఇంగ్లాండ్, ఆసీస్ దిగ్గజాలు

ప్రస్తుత తరం టెస్ట్ క్రికెట్ లో స్టార్ ఆటగాళ్ల లిస్ట్ లో టీమిండియా విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ జో రూట్ ఖచ్చితంగా ఉంటారు. ఫ్యాబ్ 4 గా పరిగణించే వారిలో కోహ్లీ, రూట్ ఉన్నారు. టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే కోహ్లీ కంటే రూట్ కాస్త పై చేయి సాధించాడు. అయితే ఆస్ట్రేలియాలో ఎవరు బెటర్ క్రికెట్ ఆడతారనే విషయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.. మైకేల్ వాన్, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్ క్రిస్ట్.. కోహ్లీకే ఓటేశారు. 

ఆస్ట్రేలియాలో రూట్ కంటే విరాట్ కోహ్లీ బాగా ఆడతాడని.. కోహ్లీకి ప్రపంచంలో కఠిన మైన పిచ్ అయినటువంటి పెర్త్ లో సెంచరీ ఉందని ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ తెలిపాడు. ఆశ్చర్యకరంగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ఆస్ట్రేలియా పిచ్ లపై తమ ఆటగాడు రూట్ కంటే కోహ్లీ మెరుగైన బ్యాటర్ అని చెప్పుకొచ్చాడు. టెస్టుల్లో కోహ్లీకి ఆస్ట్రేలియాలో అద్భుతమైన రికార్డ్ ఉంది. 2015-15 నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో కోహ్లీ ఏకంగా నాలుగు సెంచరీలు కొట్టడం విశేషం. అడిలైడ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలతో పాటు మెల్ బోర్న్, సిడ్నీలో సెంచరీలు బాదాడు. మరోవైపు రూట్ ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై సెంచరీ కొట్టలేదు.

Also Read :- భారత్‌ను భయపెట్టిన బంగ్లా

ప్రస్తుత ఫామ్ విషయానికి వస్తే రూట్ టాప్ లో ఉన్నాడు. టెస్టుల్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే శ్రీలంక సిరీస్ లో టెస్టుల్లో 34 సెంచరీలు పూర్తి చేసుకొని ఇంగ్లాండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. మరోవైపు కోహ్లి టెస్ట్ ఫామ్ 2020 నుండి దిగజారుతూ వస్తుంది. 29 మ్యాచ్‌ల్లో 50 ఇన్నింగ్స్‌ల్లో 33.59 సగటుతో 1646 పరుగులు చేశాడు. అతని ఖాతాలో రెండు సెంచరీలు.. 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.