హైదరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజువారి వేతనాన్ని రూ.257కు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్లుగా రోజువారీ వేతనం రూ.237 అమలులో ఉండగా తాజాగా రూ.20 పెంచింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త కూలి రేట్లు అమల్లోకి రానున్నాయి.
