మెక్సికో దేశంలో ఒక పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఇలా బట్టలిప్పి, ఒంటిమీద అండర్ వేర్ తో వాళ్ల ప్రధానిని విమర్శించారు. నన్ను నగ్నంగా చూడడానికి నువ్వు సిగ్గుపడొచ్చు.కానీ ప్రైవేట్ కంపెనీల వల్ల దేశం మొత్తం నగ్నంగా తయారైందని, ఉద్యోగాలు లేక ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారని, ప్రజా సంపదని దోచుకతింటున్నా నీకు మాత్రం సిగ్గులేదు అని పార్లమెంట్ లో ప్రధానిని అడిగి కడిగేశారంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే ఆ ఫోటో ఫ్యాక్ చెక్ చేయగా..ఆ ఫోటో 2013సంవత్సరం అని తేలింది. ఇక ఆ ఫోటోలో మెక్సికో పార్లమెంట్ సమావేశంలో డెమోక్రటిక్ రివల్యూషన్ పార్టీ ప్రతినిధి ఆంటోనియో గార్సియా కోనేజో..ఆదేశంలో చమురు, అయిల్ భూగర్భ నిక్షేపాల్నిప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వివాదాస్పద ఇంధన బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపినందుకు 13 డిసెంబర్ 2013 న కోనేజో నిరసన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చమురు నిక్షేపాల్ని ప్రైవేట్ పరం చేయడంపై తన లోదుస్తులతో నిరసన వ్యక్తం చేశారు.అవినీతికి వ్యతిరేకంగా కాదు, చమురు మరియు గ్యాస్ నిక్షేపాల్ని వెలికి తీసేందుకు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడంపై ఈ నిరసన అంటూ ఆంటోనియో గార్సియా కోనేజో పార్లమెంట్ లో ఆందోళన వ్యక్తం చేశారు.
