కర్కాటక రాశిలోకి బుధుడు : జులై 25 వరకు 12 రాశుల వారికి ఆదాయం, ఆరోగ్యం ఇలా..

కర్కాటక రాశిలోకి బుధుడు : జులై 25 వరకు 12 రాశుల వారికి ఆదాయం, ఆరోగ్యం ఇలా..

ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న బుధుడు జూలై 8 నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. జులై 25 వరకూ అంటే దాదాపు మూడు వారాల పాటూ కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఈ  ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది.

జ్యోతిష్యం ప్రకారం బుధగ్రహాన్ని గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. బుధుడు మేధస్సు, కమ్యూనికేషన్, సంపద, వాణిజ్యం మరియు చర్చల గ్రహంగా పరిగణిస్తారు. ఇక ఈ గ్రహాల యువరాజు స్థితిగతులు లాభదాయకంగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే జూన్ 9న బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.  కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటే కొన్ని రాశులవారికి  అనుకూల ప్రభావం ఉంటుంది.  బుధుడి ఆశీస్సులతో స్థానికుల జీవితంలో ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. జాతకంలో బుధుని బలంతో  అవగాహన, ఆలోచనా శక్తి మెరుగ్గా ఉంటాయి. దాని ప్రభావంతో, మీరు మీ ఉద్యోగం, వ్యాపారం మరియు వ్యాపారంలో బాగా పని చేస్తారు. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, బుధ గ్రహం సంచారం చేసినప్పుడు  12 రాశుల వారిని  ఒక రూపంలో ప్రభావితం చేస్తుంది. 

మేషరాశి :  కర్కాటక రాసిలో బుధుడి సంచారం వల్ల మేష రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. . ఈ రాశి చక్రంలో నాల్గవ ఇంట్లో బుధుడు సంచారిస్తున్నాడు. దీని ఫలితంగా వాహనాల కొనుగోలు ,ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరిగి ..ఖర్చులు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.    రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆర్ధికంగా చాలా లాభాలు వస్తాయి.   ఆస్తి తగాదాల వల్ల కొంత చికాకుగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 

వృషభ రాశి  : బుధుడి సంచారం వృషభ రాశి వారికి జీవితంలో పురోగతిని కలిగిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది.  నూతన వాహనం కొనుగోలు చేయడం..  ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా ఉంది.   అయితే మార్కెటింగ్ రంగం వారు  బాగా డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందుతారు. తోటి ఉద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. విదేశీ ప్రయాణం చేయాలనుకొనే వారికి  ఇది సరైన సమయం కాదు

మిధునరాశి :   మిథునరాశి వారికి భద్ర రాజయోగం చాలా కలిసి వస్తుంది. బుధగ్రహ సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంది. ఈ సమయంలో మీరు మీ పని లేదా వ్యాపారంలో విజయాన్ని పొందవచ్చు.  ఈ సమయంలో ఆకస్మిక ధనాన్ని అందుకోవచ్చు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది.  కొత్త అతిథి రాకతో కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లికి సంబంధించిన చర్చలు కూడా సఫలమవుతాయి. శరీరం యొక్క దృఢత్వం, ముఖ్యంగా చర్మ వ్యాధులు మరియు కడుపు సంబంధిత సమస్యల గురించి జాగ్రత్తగా ఉండండి.

కర్కాటకరాశి :  బుధుడు సంచరించడం కర్కాటక రాశి వారికి అదృష్ట సమయాన్ని సూచిస్తుంది. ఫలితంగా కర్కాటక రాశివారికి ఆర్థిక ప్రయోజనాలుంటాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అవకాశం ఉంది. ఎప్పటినుంచో చేతికిరాదు అనుకున్న డబ్బు అనుకోకుండా అందుతుంది. వెంటాడుతున్న సమస్యలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం. అయితే దూరప్రయాణాలు చేయకపోవడమే మంచిది

సింహ రాశి :  బుధ సంచారం వలన సింహరాశి ఉద్యోగులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంటుంది.  ఈ సమయంలో ఈ రాశివారికి ఖర్చులు అధికంగా ఉంటాయి.  స్నేహితులు ,బంధువుల నుంచి  శుభవార్తలు అందుకుంటారు.  మీరు వీసా, పాస్ పోర్ట్ కోసం  దరఖాస్తు చేసే వారికి ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటాయి.  ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. 

కన్యారాశి: కర్కాటకరాశిలో బుధ సంచారం కారణంగా కన్యారాశివారికి కూడా అనుకూల పరిస్థితులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా మీరు ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంటారు. కష్టానికి తగిన ఫలితం, గుర్తింపు దక్కుతాయి. మీలోని నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారంలో విజయం సాధించవచ్చు.

తులా రాశి: కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం తులారాశివారికి శుభఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ వంటివి లభిస్తాయి. అలాగే వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు, సంతాన ప్రాప్తి, పట్టిందల్లా బంగారం అన్న పరిస్థితులు కలుగుతాయి.. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఢోకా లేదని పండితులు చెబుతున్నారు. 

వృశ్చిక రాశి: కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం  వృశ్చిక రాశివారికి  అనుకూల ఫలితాలు ఉంటాయి.  ఆధ్యాత్మిక విషయాలతో కాలక్షేపం చేస్తారని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు.   ఇష్టమైన  దైవ దర్శనం వారి దర్శనం చేయడం.. దానధర్మాలు చేయడానికి  ఎక్కువ ఖర్చు పెడతారట.  సోదరుల మధ్య సఖ్యత దెబ్బతినే అవకాశం ఉన్నా ఇది తాత్కాలికమే. అన్నదమ్ముల మధ్య మాట పట్టింపులకు పోకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం. 

ధనుస్సు రాశి :  ఈ  రాశి వారు ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది.  ధనుస్సు రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. షేర్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం వంటివి ఆలోచించి చేయాలి.  జాయింట్ వ్యాపారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి .. కొత్త ఒప్పందాలు చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్య విషయంలో కొన్ని ఒడిదుడికులు ఉండే అవకాశం ఉంది. 

మకరరాశి :  కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం  వలన మకర రాశి జాతకులకు చాలా ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది.  కోర్టు కేసుల్లో విజయం పొందుతారని  ఈ కాలంలో మీరు ఏదైనా చట్టపరమైన కేసులో విజయం పొందవచ్చు.. భాగస్వామ్య వ్యాపారాలు మెరుగుపడే అవకాశాలున్నాయి. 

కుంభ రాశి:   ఈ రాశి వారికి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం  ప్రభావం ఉంటుంది.  ఎవరికైనా ఎక్కువ డబ్బు ఇస్తే, ఆ డబ్బు సకాలంలో అందదు. విదేశీ ఉద్యోగం  కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగంలో  కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది.  ఆరోగ్య విషయంలో కండరాల నొప్పులు వంటివి తలెత్తే అవకాశం ఉంది. 

మీనరాశి:  మీనరాశి బుధ సంచారము మీ వ్యక్తిగత జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీరు అంతర్గత శక్తిని కాపాడుకోగలుగుతారు. మీ ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు ఉండవచ్చు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.   ట్రేడింగ్ ద్వారా మంచి డబ్బు లాభం పొందే అవకాశం ఉంది. అయితే  ఈ కాలంలో మీ చేతులతో వ్యాపారాన్ని ప్రారంభించకపోవడం మంచిది.