Astrology: జులై 31న శుక్రుడు.. సింహరాశిలోకి ప్రవేశం.. 5రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

 గ్రహాల రాకుమారుడైన బుధుడు జూలై 16న సింహ రాశిలోకి ప్రవేశించాడు. వచ్చే నెల 22వ తేదీ వరకు బుధుడు అదే రాశిలో సంచరిస్తాడు. అయితే జులై 31న శుక్రుడు తన దిశను మార్చుకుని సింహ రాశిలోకి ప్రవేశించి ఆగస్టు 25 వరకు ఇదే రాశిలో ఉంటాడు.  సింహం రాశిలో బుధుడు, శుక్రుడి కలయిక వల్ల  కొన్ని రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. మేషరాశి, మిథునరాశి , మకర రాశి, తులారాశి, మీనరాశి వారు పట్టిందల్లా బంగారమేనని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మిగతా  రాశుల వారికి  సింహరాశి లో శుక్రుడి సంచారం వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం

ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, శారీరక సుఖాలకు కారకుడైన శుక్రుడు... సింహరాశిలో ఎంతో హుందాగా వ్యవహరిస్తాడు. ఈ శుక్రుడిని తొమ్మిదవ స్థానం నుంచి గురువు, సప్తమ స్థానం నుంచి శనీశ్వరుడు వీక్షిస్తున్నందువల్ల ఈ గ్రహ కారకత్వాలలో కొంత మార్పు చోటు చేసుకుంటుంది. . . బుధుడు, శుక్రుడి కలయిక కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది. సింహరాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.

మేష రాశి:  సింహరాశిలో శుక్రుడు, బుధుడు కలసి సంచరించడవతో ఈ రాశి వారికి  అన్ని రంగాల్లో విజయం పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో జీవితంలో ప్రతి పనిలో అదృష్టం మీకు కలిసి వస్తుంది. నిలిచిపోయిన పనులు కూడా ప్రారంభం అవుతాయి. వివాహితులు తమ కుటుంబాలతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. వాహనాలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి చేసుకుంటారు. విద్య, వృత్తి వ్యాపారాల్లో అనుకోని ప్రగతి సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయం.  ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రమోషన్​ వచ్చి  వేతనం పెరుగుతుంది. 

వృషభ రాశి:  సింహరాశిలో శుక్ర గ్రహం సంచారం వలన వృషభ రాశివారు తమ కుటుంబం పట్ల మరింత ఎక్కువ అంకిత భావాన్ని పెంచుకుంటారు. ఇంటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వృత్తిపరంగా మరో మెట్టుపైకి ఎక్కనున్నారు. ఆర్థికంగానూ వృద్ధి చెందనున్నారు. పెండింగ్ లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. అయితే  గురు, శనులు బలంగా వీక్షించడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో సహచరులతో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. సాధారణ పరిచయం నుంచి ప్రేమలోకి దిగిపోవడం జరుగుతుంది. సాధారణంగా ప్రేమ వ్యవహారాలకు పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో భారీగా ఖర్చయ్యే అవకాశం కూడా ఉంటుంది. 

మిథున రాశి: శుక్రుడు సింహరాశిలో సంచరించడం వలన  మిథున రాశివారికి లక్ష్మీనారాయణ యోగం కలిగి అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి రంగంలో విజయం, సంతోషకరమైన కుటుంబం, వైవాహిక జీవితం వీరికి లభిస్తుంది. కార్యాలయంలో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ ఆఫీసుల్లో పదోన్నతులతో పాటు జీతం పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది. భవిష్యత్తు కోసం అనేక ప్రణాళికలు కూడా వేసుకుంటారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. 

కర్కాటక రాశి: సింహరాశి  ద్వితీయ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల కర్కాటక రాశి వానిరి  ప్రేమ జీవితం నుంచి పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ప్రేమ భాగ స్వామికి భారీగా కానుకలు, వస్త్రాభరణాల కొనివ్వడం వంటివి జరుగుతాయి. ఈ శుక్రుడి మీద గురు, శనుల దృష్టి పడి నందు వల్ల ప్రేమ వ్యవహారాలు బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది.. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు చేయడానికి అనుకూల సమయం. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే.. అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. 

సింహరాశి: ఈ రాశిలోకే శుక్రుడు ప్రవేశిస్తున్నాడు . ఈ రాశివారికి అంతా మంచి కాలం నడుస్తుందని అర్థం. ప్రతి విషయంలోనూ అంతా అనుకూలంగానే జరుగుతుంది. రొమాంటిక్ లైఫ్ మరింత ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు. సింహ రాశి వారికి శుక్ర సంచారము  లక్ష్మీనారాయణ యోగంతో పాటు  శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయంలో విజయం సాధిస్తారు. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా వాటిని అమలు చేయండి. మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.

 కన్యారాశి: సింహరాశిలో.. బుధుడు, శుక్రుడు కలయిక వలన కన్యా రాశి వారికి డబ్బు ఎక్కువ చేస్తారు.  లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే అవకాశం కూడా రావచ్చు. మీరు పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగాలు చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆదాయ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.

 తులారాశి: సింహరాశిలో శుక్రుడు సంచారం వలన .. తులారాశికి చెందిన వ్యాపారస్తులు రాబోయే రోజుల్లో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. దీర్ఘ కాలంగా ఉన్న రుణాలను తిరిగి చెల్లించగలుగుతారు. వ్యాపారస్థులు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సంతానం, ఆరోగ్యం గురించి ఆందోళన చెందే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.వస్తు సంపదలో పెరుగుదల ఉంటుంది. ఈ రాశివారు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. వారి కోరికలన్నీ ఒక దాని తర్వాత మరొకటి తీరుతాయి. అన్ని పనులు ప్రశాంతంగా జరుగుతాయి. కొత్త ప్రేమలు పుట్టుకువస్తాయి.

వృశ్చికరాశి: సింహరాశిలో బుధుడు, శుక్రుడు కలిసి సంచారం వలన  వృశ్చిక రాశి వారికి వ్యాపారం పరంగా  అనుకూల సమయం. వ్యాపారం సజావుగా సాగుతుంది. లాభాలు గడిస్తారు. అయితే.. వ్యక్తిగత జీవితం అంత సజావుగా సాగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గ్రహాల రాశి మార్పు  మార్పు కారణంగా, ఈ రాశికి చెందిన వ్యక్తులు మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. ప్రేమ మరియు వ్యక్తిగత జీవితం శృంగారభరితంగా ఉండబోతుంది. కష్ట సమయాల్లో మీరు మీ కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

ధనస్సు రాశి: సింహరాశిలో బుధుడు, శుక్రుడు మరియు రవి గ్రహాల సంచారం ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి  ఇదే సరైన సమయం. ఈ నెలలో  మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కెరీర్  కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అదే  సమయంలో, మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.ఆర్థిక పరిస్థితి  మెరుగుపడుతుంది.

మకరరాశి: సింహరాశిలో... బుధ, శుక్రుల కలయిక వల్ల మీ కుటుంబ సంబంధాలు బాగా పెరుగుతాయి. చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్న వారు తమకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశముంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కలలు కూడా నెరవేరుతాయి. పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. వ్యాపారస్థులు పాత సమస్యల నుంచి సమర్థవంతమైన మార్గాన్ని కనుగొంటారు. మీ భాగస్వామితో మీ సంబంధం చాలా బాగుంటుంది. విహార యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉందని పండితులు చెబుతున్నారు.

కుంభరాశి: బుధుడు, శుక్రుడు.. సింహరాశిలో కలవడం వలన  వివాహితులకు ఈ సమయంలో చాలా మంచి చేస్తుంది. జీవిత భాగస్వామితో మరింత ఎక్కువగా బంధం బలపడుతుంది. వ్యాపారాలు చేసేవారికి ఇది మరింత అనుకూల సమయం. ఎక్కువ ఆర్థికంగా ఎదుగుతారు. అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. స్నేహితులు పెరుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి.  ఉద్యోగులకు వేతనం పెరిగే అవకాశం ఉంది.  అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

మీన రాశి:  గత కొన్నిరోజులుగా మీ ఆరోగ్యం బాగా లేకపోతే చింతించకండి. రాబోయే రోజుల్లో ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారంలో సానుకూల మార్పులు కూడా వస్తాయి. దాని కారణంగా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు పనికి సంబంధించి లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన కూడా వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే మీ జీతం కూడా పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది.